గత ఏడాది మృతి చెందిన మారం పున్నమ్మ మృతదేహాన్ని వెలికి తీసి రి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన పిడుగురాళ్ల బెల్లంకొండ డొంక పొలంలో గురువారం జరిగింది. ఎస్ఐ మోహన్ కథనం ప్రకారం మృతిచెందిన పున్నమ్మ కుమారుడు ఫిర్యాదు మేరకు రీ పోస్టుమార్టం నిర్వహించాల్సి వచ్చిందని అన్నారు. కోర్టు ఆదేశాలతో పొలంలో ఉన్న సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికి తీసి తహశీల్దార్ మధుబాబు పర్యవేక్షణలో రీ పోస్టుమార్టం నిర్వహించారు.