పిడుగురాళ్ల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి బైపాస్. కామేపల్లి అడ్డరోడ్డు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొన్నాయి. రెండు బైకులపై ప్రయాణిస్తున్న ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఆసుపత్రులకు తరలించారు. అనంతరం వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్