పిడుగురాళ్లలో ఏటీఎం చోరీ కేసును చేదించిన పోలీసులు

పిడిగరాళ్లలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసై, ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతలను దుర్వినియోగం చేసి సుమారు రూ. 87 లక్షలకు పైగా స్వాహా చేసిన సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఉద్యోగి మామిడి నరేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గురజాల డీఎస్పీ మహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, ఆడిట్‌లో లోటు బయటపడడంతో పరారైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్