గురజాలలో పండగ పూట రోడ్డు ప్రమాదం

గురజాల పట్టణంలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. గురజాలలోని చల్లగుండ్ల గార్డెన్ సమీపంలో మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఒకరిని 108 వాహనంలో పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. మరొకరికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్