వెలిగండ్ల మండలం గన్నవరం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు అన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డిని విజ్ఞాన్ రెసిడెన్షియల్ స్కూల్ పూర్వ విద్యార్థులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి వెంకటరామిరెడ్డి చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.