హెల్మెట్ భారం కాదు బాధ్యత అని కనిగిరి మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ లో బుధవారం హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆయన అవగాహన కల్పించారు. బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ ధరించడం ద్వారా అనుకోని ప్రమాదాలు ఏర్పడితే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు అన్నారు.