విజయవాడ పోలీస్ కమిషనర్ శేఖర్ బాబును మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థాన మాజీ చైర్మన్ పాములపాటి మాధవ ప్రసాద్ బుధవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి వారి చిత్రపటాన్ని కమిషనర్ కు మాధవ ప్రసాద్ బహూకరించారు. కనిగిరి ప్రాంతానికి చెందిన రాజశేఖర్ బాబు విజయవాడ పోలీస్ కమిషనర్ స్థాయికి ఎదగడం అభినందనీయమని మాధవ ప్రసాద్ అన్నారు.