తుఫాను నేపథ్యంలో మాచర్లలో 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు

తుఫాను కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు మాచర్ల డివిజన్ కార్యాలయంలో 24 గంటల ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. APCPDCL/CMD ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. కాల్ సెంటర్ నెంబర్ 9440817531. విద్యుత్ స్తంభాలు విరిగిపోయినా, సర్వీస్ వైర్లు తెగిపోయినా, చెట్లు విద్యుత్ లైన్లపై పడినా, లేదా ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తినా వెంటనే ఈ నెంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. సింగయ్య కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕