పల్నాడు జిల్లా మాచర్ల శివారులో ఆదివారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో బైక్ డివైడర్ను బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన శంకర్, బాలకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, ఉప్పుతోళ్ల గురవయ్య పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.