పల్నాడు జిల్లాలో పోలీసులు నాలుగు చోరీ కేసులను ఛేదించి, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్పీ జగదీశ్ శనైవరం తెలిపిన వివరాల ప్రకారం నిందితుల నుంచి 362 గ్రాముల బంగారం, 5.9 కిలోల వెండి ఆభరణాలు, రూ.1.02 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాల ద్వారా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. మరికొంత బంగారం రికవరీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ కేసుల ఛేదనతో జిల్లాలో చోరీల వెలుగులోకి వచ్చాయి.