కారంపూడిలో ఉడుములు మెరుపులతో కూడిన భారీ వర్షం శనివారం మధ్యాహ్నం పడింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి. ఒక్కసారిగా మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అక్కడక్కడ తేలికపాటి చెట్లు కూడా విరిగిపడ్డాయి. తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ పలుమాలు ఆదేశాలు జారీ చేశారు.