కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం: ఓటర్ల జాబితా ప్రక్రియ ప్రారంభం

కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి, పున: ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను చేపడుతున్నట్లు ఎన్నికల నమోదు అధికారి, గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి సూచనల మేరకు తెలియజేయడమైనది. ఈ నోటీసును సోమవారం మాచర్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, మాచర్ల పురపాలక సంఘం కమిషనర్ కార్యాలయం, విద్యాసంస్థలు, సంబంధిత పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించారు. అర్హులైన ఉపాధ్యాయులు ఫారం-19 సమర్పించి ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వేణుబాబ్ కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕