మాచర్ల ఎంపీడీవో కార్యాలయంలో పీఏఐ 2.0పై సచివాలయ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఎంపీడీవో ఫణికుమార్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో పంచాయతీ అభివృద్ధికి అవసరమైన సూచికలు, మూల్యాంకన విధానం, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధిలో ఇది కీలకంగా నిలుస్తుందన్నారు.