మాచర్ల జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుండెబోయిన సాంబశివరావు శుక్రవారం మాచర్ల PACS చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన మాచర్ల బిజెపి ఎస్ఐఆర్ కన్వీనర్ గొబ్బూరి శ్రీనివాస్ నాయుడు, గుమ్మడి నాసరయ్య, ఆలేటి సజ్జన్, పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సహకార సంఘం అభివృద్ధికి, రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా బిజెపి ఎస్ఐఆర్ కన్వీనర్ గొబ్బూరి శ్రీనివాస్ నాయుడు కోరారు.