మాచర్ల తహశీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఎస్ఐఆర్ సమావేశం

పల్నాడు జిల్లా మాచర్లలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏఈఆర్ఓలు, తహశీల్దార్తో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై సమావేశం శనివారం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి, 101-మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఈఆర్ఓ ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటలకు జరిగిన ఈ సమావేశంలో ఎస్ఐఆర్ షెడ్యూల్, హియరింగ్స్ నిర్వహణ విధానం, పెండింగ్లో ఉన్న ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిశీలన, తదుపరి చర్యలపై చర్చించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంపై అధికారులు వివరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕