ఎర్రబాలెం చోరీ కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్

మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఇటీవల జరిగిన చోరీ కేసును మంగళగిరి రూరల్ పోలీసులు ఛేదించారు. ఓ ఆర్‌ఎస్‌ఐ నివాసంలో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు 22 గ్రాముల బంగారం, 122 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీఐ వెంకట్, ఎస్‌ఐ నవీన్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించారు.

సంబంధిత పోస్ట్