మంగళగిరి: గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి

మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామ శివారు లో హైవే మీద నడుచుకుంటూ వెళుతున్న సుమారు 50 సంవత్సరాల వయసుగల వ్యక్తిని ఈనెల 12వ తారీఖున గుర్తుతెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టడం వలన అతని తలకు తీవ్రమైన గాయం అవ్వడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆత్మకూరు గ్రామ వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీస్ లు కేసు నమోదు చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్