ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ

గుంటూరు జిల్లా, పెదకాకాని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ లబ్ధిదారులకు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెదకాకాని-6, కొప్పురావూరు-2, నంబూరు-1, వెంకటకృష్ణాపురం-1 గ్రామాలకు చెందిన మొత్తం 10 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్