మాజీ సీఎం జగన్ నివాసం వద్ద అగ్నిప్రమాదం జరిగింది. తాడేపల్లిలోని ఇంటి ఫెన్సింగ్ కు ఆనుకుని ఉన్న గార్డెన్ లో మంటలు చెలరేగాయి. బుధవారం సాయంత్రం ప్రమాదం జరగగా ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. రాత్రి 9 గంటల సమయంలో మరోసారి మంటలు చెలరేగడంతో సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. వైయస్ జగన్ భద్రతపై ప్రజలు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.