ఉద్దండ్రాయునిపాలెంలో రాజు అనే టీడీపీ స్థానిక నేతపై శనివారం రాత్రి వేసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్, అతని అన్న ప్రభుదాసు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన రాజు ఇప్పుడు మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. దాడిపై బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. అమరావతిలో ఓ మహిళ హత్య కేసులో సురేష్ దాదాపు 3 నెలలు జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదయ్యాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.