కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల నిరసన

పల్నాడు జిల్లాలో కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం TEAM PALNADU – AP PARAMEDICAL JAC ఆధ్వర్యంలో నరసరావుపేటలో బుధవారం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, జేఏసీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ఐక్యత చాటారు. స్టాఫ్ నర్స్ జేఏసీ పల్నాడు జిల్లా అధ్యక్షురాలు బి. నాగరాజ కుమారి నేతృత్వంలో ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, 100 శాతం గ్రాస్ జీతాలు చెల్లించాలని, రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, హెల్త్ కార్డులు, పరస్పర బదిలీలు కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్