గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చెదవరపాడు అరవింద్ బాబు సినిమా రంగంలో అడుగుపెడుతున్నారు. ఆయన ఒక సినిమాతో నటుడిగా పరిచయం అవుతున్నారు. నటిస్తున్న ప్రథమ చిత్రం విశేషాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఈ సినిమాలో ఎమ్మెల్యే పాత్ర కీలకమైనదిగా ఉండనుందని స్పష్టం చేశారు. దర్శకుడు నరేష్ దోనే, మణిపర్తి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.