దీపావళి పండుగ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు బాణాసంచా దుకాణాదారులకు బుధవారం పలు సూచనలు చేశారు. 1. నివాస ప్రాంతాలకు నిర్దిష్ట దూరంలో ఉండాలి, 2. ఆ ప్రదేశాల్లో సిగరెట్లు, పెట్రోల్, అగ్గిపెట్టెలు ఇతర వస్తువులు అనుమతించరాదు 3. దుకాణాల వద్ద నిర్దిష్ట దూరం ఉండాలి 4. 2అగ్ని నిరోధక సిలిండర్లు, 2 బకెట్ల పొడి ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలని ఎస్పీ ఈ మేరకు పల్నాడు జిల్లా పోలీసులు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.