పల్నాడు జిల్లాలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి ఎడ్లపాడు, నాదెండ్ల మండలాల్లోని మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కళ్ళల్లో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దయింది. తగిన జాగ్రత్తలు తీసుకున్న కూడా వర్షానికి తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కళ్ళల్లో తడిసిన మిర్చిని మండల అధికారులు పరిశీలించారు.