నరసరావుపేట: రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

రొంపిచర్ల మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు మండల విద్యుత్ శాఖ ఎఇ కె. రాంబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండవ శనివారం కనుక పిడుగురాళ్ళ 220కెవి సబ్ స్టేషన్ లో అత్యవసర మరమ్మత్తు పనుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపి వేయుచున్నామని అన్నారు. అదే విధంగా మండలంలో రొంపిచర్ల, వి. రెడ్డిపాలెం, సుబ్బయ్యపాలెం, బుచ్చిపాపన్నపాలెం, సుబ్బయ్యపాలెం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్