నరసరావుపేట పట్టణంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు శుక్రవారం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు. రెండో శనివారం పట్టణ పరిధిలోని అన్ని 33కేవీ, 11కే. వి సబ్ స్టేషన్ల, ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ లైన్లు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నరసరావుపేటలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులందరూ గమనించి సహకరించాలని కోరారు.