రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెం గ్రామం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి నార్కెట్పల్లి హైవే రోడ్డులో నెల్లూరు వైపు నుంచి నార్కెట్పల్లి వైపు వెళ్తున్న ఓ కెమికల్ పౌడర్ లారీ తెల్లవారు జామున అదుపుతప్పి హైవే రోడ్డు పక్కన ఉన్న వాగులోకి బోల్తా పడింది. లారీలో డ్రైవర్, క్లీనర్ ఉండగా క్లీనర్ తలకు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.