పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో చోరీకి సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇద్దరు చోరులు పట్టపగలే ఆలయంలోకి ప్రవేశించి, మండపంలోని సీసీ కెమెరాల మానిటర్ ని అపహరించుకెళ్లారు. దొంగతనంపై దేవాలయం పూజారి రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆలయ పూజారి తెలిపారు.