పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులో ఇంజిన్ భాగం నుంచి దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగాయి. నరసరావుపేట నుంచి విద్యార్థులను తీసుకువచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు దించాడు. స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.