సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

తక్కువ మొత్తంలో పెట్టుబడులు, ఎక్కువ మొత్తంలో ఆదాయాల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, యాప్ లు, వాట్సాప్ గ్రూప్ లు, టెలిగ్రామ్ ఛానల్ లు, కంపెనీ బ్రాండ్ ను పోలిన వెబ్సైటులను రూపొందించి సైబర్ నేరగాళ్లు పెట్రేగి పోతున్నారని తెలిపారు. వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.

సంబంధిత పోస్ట్