పార్లమెంట్ ఏర్పాటు చేసిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. 15 మంది సభ్యులు గల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికలలో 19 నామినేషన్లు రాగా, వారిలో నలుగురు ఉపసంహరించుకున్న క్రమంలో మిగిలిన వారిని సభ్యులుగా పార్లమెంట్ నియమించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీల సభ్యుడిగా ఎన్నికైన ఒంగోలు ఎంపీ మాగుంటకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.