ప్రముఖ నెయ్యి నాణ్యతపై అనుమానం

పర్చూరులో ఒక ప్రముఖ కంపెనీ నెయ్యి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. స్థానికుడు పేర్ని హరిబాబు ఒక టీ దుకాణంలో కొనుగోలు చేసిన నెయ్యి ప్యాకెట్ నూనె రంగులో, వాసన లేకుండా ఉండటంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా ఆహార భద్రతా అధికారి గురువారం ఆ నెయ్యి ప్యాకెట్ల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్