ఇంకొల్లు-పర్చూరు ప్రధాన రహదారి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. తీవ్ర ఎండల వల్ల మంటలు వేగంగా వ్యాపించి, దట్టమైన పొగ రహదారిని కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎమ్మార్వో ఏవీఎస్ శ్రీనివాస్, స్థానికుల సహాయంతో వాటర్ ట్యాంకర్ ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.