పర్చూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు, పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎలా చెలరేగాయనేది ఇంకా తెలియరాలేదు. భారీ శబ్దాల కారణంగా ప్రజలు ఘటన స్థలానికి వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంటున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.