కారంచేడు మండలం స్వర్ణపాలెంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం పోషణ మహోత్సవం నిర్వహించారు. చిన్నారులకు ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను సిడిపిఓ సులోచన, ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత తల్లులకు వివరించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలని సూచించారు. చిరుధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.