యనమదలలో వడదెబ్బతో ఒకరు మృతి

యద్దనపూడి మండలం యనమదల గ్రామానికి చెందిన సుధాకర్ (43) తీవ్ర ఎండల వేడిమికి వడదెబ్బతో మృతి చెందారు. నీరసించిపోవడంతో మొదట గ్రామంలోని RMP వైద్యుడి వద్ద చికిత్స పొందినా, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పడంతో, సోమవారం గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందారు.

సంబంధిత పోస్ట్