రేషన్ బియ్యం పట్టివేత

కాకుమాను నుండి బాపట్ల వైపు వస్తున్న అక్రమ రేషన్ బియ్యం రవాణా చేస్తున్న మినీ లారీని రైలుపేటలోని జమేధార్ పేట వద్ద సివిల్ సప్లై అధికారులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. వాహనాన్ని ఆపి అధికారులు పట్టుకునే లోపే డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. అధికారులు లారీని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు. ఈ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్