చెరుకూరులో వరుణ యాగం

చెరుకూరులోని శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం వరుణ యాగం, వరుణ జపం, సహస్ర ఘటాభిషేకం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు, యాగ క్రతువులు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕