పెదకూరపాడు నియోజకవర్గ రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు సందేపోగు అశోక్, అచ్చంపేటలో జూన్ 30న మూసివేసిన ఎస్టీ బాలుర గిరిజన వసతి గృహాన్ని వెంటనే పునఃప్రారంభించాలని కోరారు. సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అచ్చంపేట మండలం విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతమని, ప్రస్తుతం 17 మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉండగా మరో 30 మంది దరఖాస్తు చేసుకున్నారని, హాస్టల్ మూసివేతతో గిరిజన విద్యార్థుల చదువుకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. మౌలిక వసతులు కల్పించి హాస్టల్‌ను వెంటనే పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.