పిడుగు పడి పూరిల్లు దగ్ధమైన ఘటన మండెపూడిలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మండెపూడికి చెందిన సాంబయ్యనాయక్ కుటుంబ సభ్యు లతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పిడుగు పడింది. పూరిల్లు దగ్ధమైంది. ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. కుటుంబ సభ్యులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.