అచ్చంపేటలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు

అచ్చంపేట మండలంలోని స్థానిక ఎంఆర్వో (MRO) కార్యాలయ ఆవరణలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి, సామాజిక న్యాయానికి చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సందేపోగు వెంకయ్య, టీడీపీ యూనిట్ ఇన్‌చార్జ్ తిరువాయిపాటి ఆంజనేయులు, టీడీపీ టౌన్ అధ్యక్షుడు సందేపోగు గాంధీ, సందేపోగు సామియేలు తదితరులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనియాడుతూ ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్