అమరావతిలో ఘోరంమైన హత్య

అమరావతి మండలం గిడుగులో మద్యం మత్తులో ఘోరమైన హత్య శనివారం చోటు చేసుకుంది. కోటేశ్వరరావు (36)ను అదే గ్రామానికి చెందిన జాలయ్య బండరాయితో తలపై కొట్టడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. మధ్యాహ్న సమయంలో మద్యం తాగి ఇద్దరి మధ్య మాట మాట పెరిగి దుర్భాషలాడుకున్నారు. తీవ్రమైన ఆవేశంతో నిందితుడు జాలయ్య ఎదురుగా ఉన్న కోటేశ్వరరావుపై బండరాయితో దాడి చేశాడు. జాలయ్యపై అమరావతి పోలీస్ కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్