పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ సహాయ సహకారాలతో, క్రోసూరు మండలంలోని అందుకూరు గ్రామం నుండి సత్తెనపల్లి మండల పరిధిలోని గోరంట్ల గ్రామం వరకు నూతనంగా డొంక రోడ్డు మార్గాన్ని నిర్మించారు. ఎన్నో దశాబ్దాల నుండి అందుకూరు, గోరంట్ల గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు అతి త్వరగా పరిష్కారం లభించడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు మార్గం నిర్మాణంలో అందుకూరు గ్రామ నేతలు పాల్గొన్నారు.