పెదకూరపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు ఆగస్టు 8వ తేదీన జరుగుతాయని పెదకూరపాడు మండల విద్యాశాఖ అధికారి ఏకుల ప్రసాదరావు గురువారం తెలిపారు. పాఠశాలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఎన్నికల షెడ్యూల్ మరియు ఎన్నికల సంబంధించిన వివిధ విధానాలను మార్గదర్శకాలను కూడా విడుదల చేశామన్నారు. ఈ ఓటర్ల జాబితా మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 5 తేదీ లోపు తెలపాలన్నారు.