భీమినేని వారి పాలెంలో చోరీ

భీమినేని వారి పాలెంలో చోరీ ఘటన పై శనివారం మేడికొండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అచ్చంపేట మండలం తాళ్ల చెరువుకు చెందిన సైమన్ రెడ్డి భీమినేనివారిపాలెం సమీపంలోని ఓ కోల్డ్ స్టోరేజ్ లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ఈ నెల 10న ఊరు వెళ్లి 13న తిరిగొచ్చారు. ఈ క్రమంలో వారి ఇంట్లో బీరువా తెరిచి ఉండటాన్ని గమనించి చోరీ జరిగినట్లు నిర్ధారించుకొని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్