జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

సిరిపురం – పెదకూరపాడు రైల్వే స్టేషన్ల మధ్య గురువారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి గుర్తుతెలియని సుమారు 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్‌ఐ ఎం. రాజ్‌మోహన్‌రావు తెలిపారు. యువకుడు అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి రావడంతో ఘటన చోటుచేసుకుందని చెప్పారు. స్టేషన్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతుడి గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్