పొన్నూరు మండలం వెల్లూరు గ్రామంలోని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ప్రైమ్ 9 రిపోర్టర్ (ఎన్టీవీ) పి. చలపతిరావు నివాసానికి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ. వి. సుబ్బారావు శుక్రవారం వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన చలపతిరావు తండ్రి రాధాకృష్ణమూర్తి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె. రాంబాబు, ప్రత్తిపాడు అధ్యక్షుడు ఆనంద్, పొన్నూరు అధ్యక్షుడు ఎం. డి. ఎం. షరీఫ్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.