గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలంలో మంగళవారం పల్లెపండుగ 3.0 కింద రూ. 2.81 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా పాతరెడ్డిపాలెం గ్రామంలో రూ. 18 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, జనసేన సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.