పెదకాకానిలో పేదల సమస్యలపై 28న సీపీఎం ధర్నా

గుంటూరు జిల్లా పెదకాకానిలో ప్రభుత్వ స్థలాల్లో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, స్థలాలు లేని నిరుపేదలకు స్థలాలు కేటాయించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ తెలిపారు. శుక్రవారం సుందరయ్య కాలనీలో ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. జీవో 306 ప్రకారం గతంలో ఇచ్చిన బీఫారాలను ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕