గర్భిణులు, తల్లులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆరోగ్య, పౌష్టికాహార అవగాహన

పొన్నూరు ముబారక్‌నగర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణులు, తల్లులకు ఆరోగ్య, పౌష్టికాహారంపై డాక్టర్ ఎన్. హిమబిందు అవగాహన కల్పించారు. తల్లి, పిల్లలకు పౌష్టికాహారం, పండ్లు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రానికి పలకలు, చాపలు, కూలింగ్ వాటర్ క్యాన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కారుమూరి శ్రీనివాస్, రావిపాటి మోహనరావు, సాధు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గర్భిణులు, పిల్లలకు రోటరీ క్లబ్ సహకారం అందించింది.

సంబంధిత పోస్ట్

✕
✕